TG: జర్నలిస్టుల సమస్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అక్రిడిటేషన్ విధివిధాల రూపకల్పనపై చర్చించారు. శాస్త్రీయ పద్ధతిలో పాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. త్వరలో కొత్త అక్రిడిటేషన్ పాలసీ అమలు చేస్తామని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.