NRPT: మరికల్ మండలంలోని పల్లె గడ్డ గ్రామ శివారులో ఆరుబయట మద్యం సేవిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు మరికల్ ఎస్సై రాము తెలిపారు. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఆరు బయట మద్యం సేవిస్తున్నట్లు గుర్తించి వారిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఆరు బయట మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.