GNTR: రాజధాని అమరావతిలో 58 అడుగుల ఎత్తులో నిర్మించనున్న అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నమూనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన ఈ నమూనాలను సీఎం పరిశీలించారు. రాజధాని ప్రాంతంలోని శాఖమూరులో 6.8 ఎకరాల్లో ప్రభుత్వం పొట్టిశ్రీరాములు స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తోంది.