TG: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వెళ్తున్న స్కూటీని టిప్పర్ ఢీకొనడంతో.. నలుగురు మరణించారు. భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద NH44పై జరిగిన ఈ ఘటనలో ఇద్దరు స్పాట్లోనే మరణించగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారు. మృతుల్లో 4, 6 ఏళ్ల చిన్నారులు, తల్లి, తాత ఉన్నారు. కొంచెం ఆలస్యమైతే అయింది, ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం.