ప్రకాశం: కనిగిరి తహశీల్దార్ కార్యాలయంలో భూముల మ్యుటేషన్‌పై ఒంగోలు ఆర్డీవో కళావతి బుధవారం విచారణ జరిపారు. కార్యాలయంలోని భూముల రికార్డులను తనిఖీ చేశారు. ఇంచార్జ్ తహసీల్దార్ వాసు మాట్లాడుతూ.. మూడు నెలలుగా మండలంలో జరిగిన భూముల మ్యుటేషన్ పై ఒంగోలు ఆర్డీవో విచారణ జరిపారని, ఏమైనా తప్పులు జరిగితే ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తారన్నారు.