SKLM: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జేకేసీ, దివీస్ లేబరేటరీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 గంటల నుంచి ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ టి.గోవిందమ్మ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో రసాయన శాస్త్రం సబ్జెక్టు చదివిన విద్యార్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.