అన్నమయ్య: సమగ్ర శిక్షా ప్రత్యామ్నాయ పాఠశాల కోఆర్డినేటర్ వెంకట్రామయ్య, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించి, డ్రాపౌట్లను అరికట్టాలని సూచించారు. బుధవారం మండలంలోని పలు పాఠశాలలను సందర్శించి, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించి, తరచుగా గైర్హాజరయ్యే విద్యార్థులను గుర్తించారు.