WGL: తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్డీవో కార్యాలయంలో ఏవోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జన సమితి రాష్ట్ర నాయకులు అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. బిసి 42% రిజర్వేషన్ అమలు చేసి బిసి ప్రజలకు రాజకీయ విద్య, వైద్య రంగాల్లో అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.