ప్రకాశం: ఒంగోలులోని శ్రీగిరిలో వెలసిన వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం సుదర్శన హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్ పర్సన్ ఝాన్సీ రాణి తెలిపారు. ఉదయం ఏడున్నర గంటలకు శ్రీవారికి పూలంగి సేవ, 9:30 గంటలకు సుదర్శన హోమం, మధ్యాహ్నం 12:30 గంటలకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున సుదర్శన హోమంలో పాల్గొనాలని కోరారు.