KMR: జిల్లాలో 49 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం బుధవారం వరకు మొత్తం 267 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు బుధవారం సాయంత్రం తెలిపారు. దరఖాస్తుల వివరాలు.. కామారెడ్డి: 15 షాపులకు 63,బాన్సువాడ: 9 షాపులకు 59,బిచ్కుంద: 10 షాపులకు 60,దోమకొండ: 8 షాపులకు 44 ,ఎల్లారెడ్డి: 7 షాపులకు 41 దరఖాస్తులు వచ్చాయని ఆయన చెప్పారు.