TPT: చంద్రగిరి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. మృతుడి వయసు సుమారు 65 ఏళ్లు ఉంటుంది. ఇతను తెలుపు రంగు షర్టు ధరించాడు. షర్ట్ పైన బ్లూ, రెడ్ కలర్లు గీతలు ఉన్నాయి. రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.