కామన్వెల్త్ క్రీడలు-2030ని అహ్మదాబాద్‌లో నిర్వహణకు కామన్వెల్త్ అసోసియేషన్ ఆమోదించిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ‘భారత్‌ను ప్రపంచ క్రీడా పటంలో ఉంచడానికి ప్రధాని మోదీ చేసిన అవిశ్రాంత కృషికి గొప్ప ఆమోదం. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను పెంచి, భారత్‌ను ఒక క్రీడా గమ్యస్థానంగా మార్చారు’ అని కొనియాడారు.