విశాఖ రాజధాని, త్వరలో జగన్ విశాఖకు షిఫ్ట్ అవుతారని ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇదే విషయాన్ని సీఎం జగన్ మరోసారి తెలిపారు. నగర అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక ఉందని.. చెన్నై, హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి చేస్తామని జగన్ అన్నారు.
CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏదంటే సరిగ్గా చెప్పుకునే పేరు లేదు. మూడు రాజధానులు అని ప్రజలను ఇన్ని రోజులు సీఎం జగన్ మభ్యపెడుతున్నారు. విశాఖ రాజధాని, త్వరలో జగన్ విశాఖకు షిఫ్ట్ అవుతారని ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇదే విషయాన్ని సీఎం జగన్ మరోసారి తెలిపారు. నగర అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక ఉందని.. చెన్నై, హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి చేస్తామని జగన్ అన్నారు. ఎన్నికల తర్వాత నేను విశాఖలోనే ఉంటా. ఈసారి సీఎంగా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు.
నగరాన్ని అభివృద్ధి చేయాలంటే ఆచరణ తప్పనిసరి. దీని రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయలేదు. కేంద్రం సహకారం కూడా ఉండాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య నమూనా కావాలి. అందరూ కలిసి కృషి చేస్తేనే విశాఖ నగరం మారుతుందన్నారు. అమరావతికి నేను వ్యతిరేకం కాదు. అది శాసన రాజధానిగా కొనసాగుతుంది. అక్కడ 50 వేల ఎకరాల బీడు భూమి మాత్రమే ఉంది. అమరావతిని అభివృద్ధి చేయాలంటే ఎకరానికి రూ.2 కోట్లు అవుతుందని వ్యాఖ్యానించారు.