ఓ రెస్టారెంట్లో ఫుడ్ తిన్న కొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో జరిగింది. ఐదుగురు ఫ్రెండ్స్ ఓ రెస్టారెంట్లో తిని రక్తపు వాంతులు చేసుకున్నారు.
Haryana: ఓ రెస్టారెంట్లో ఫుడ్ తిన్న కొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఐదుగురు ఫ్రెండ్స్ ఓ రెస్టారెంట్లో తిని రక్తపు వాంతులు చేసుకున్నారు. ఆహారం తిని బయటికి వచ్చిన వెంటనే హోటల్ ఎదురుగానే రక్తపు వాంతులు చేసుకున్నారు. హర్యాణా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో లాఫోరెస్టా కేఫ్‌కు అంకిత్ కుమార్ తన భార్య, స్నేహితులతో కలిసి వెళ్లారు. అందరూ కలిసి అక్కడ డిన్నర్ చేశారు. తర్వాత వెయిటర్ ఇచ్చిన మౌత్ఫ్రెష్నర్ను తీసుకున్నారు.
మౌత్ ఫ్రెష్నర్ తీసుకున్న కొద్ది సేపటికి వాళ్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నోట్లో మంటతో ఇబ్బందిపడడంతో పాటు రక్తం కూడా వచ్చింది. మంటను తట్టుకోలేక బాధితులు నోట్లో ఐస్ ముక్కలు వేసుకున్నారు. వీళ్లను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెస్టారెంట్ సిబ్బంది ఇచ్చిన మౌత్ ఫ్రెష్నర్ ప్యాకెట్‌ను వైద్యులకు చూపించినట్లు తెలిపారు. అది డ్రై ఐస.. చాలా ప్రాణాంతకమైన యాసిడ్ అని వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.