NLG: గుడిపల్లి పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, కేసుల దర్యాప్తు, సిబ్బంది పనితీరు పరిశీలించిన ఎస్పీ, బాధితుల పట్ల సమర్థవంతంగా స్పందించాలన్నారు. అధిక వడ్డీ పేరుతో మోసపోయిన బాలాజీ నాయక్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారని తెలిపారు. బాధితుల కోసం మూడు ప్రత్యేక బృందాలు, ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.