»Jjp Leader Ravindra Saini Shot Dead In Hisar Haryana
Haryana : హర్యానాలో జేజేపీ నాయకుడు దారుణ హత్య
హర్యానాలోని హిసార్‌లో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. హిసార్‌లోని హన్సిలో హీరో మోటార్‌సైకిల్ షోరూమ్ యజమాని రవీంద్ర సైనీని కొందరు దారుణంగా మత్య చేశారు.
Haryana : హర్యానాలోని హిసార్‌లో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. హిసార్‌లోని హన్సిలో హీరో మోటార్‌సైకిల్ షోరూమ్ యజమాని రవీంద్ర సైనీని కొందరు దారుణంగా మత్య చేశారు. రవీంద్ర సైనీ దుష్యంత్ చౌతాలా జన్నాయక్ జనతా పార్టీకి చెందిన కీలకనేత. బుధవారం సాయంత్రం బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు అతడిని కాల్చి చంపారు. రవీంద్ర సైనీకి కూడా ఒక గన్‌మ్యాన్ ఉన్నాడు. అయితే అతనిపై దాడి జరిగినప్పుడు గన్‌మ్యాన్ అతను రవీంద్ర సైనీతో లేడు షోరూమ్‌లో ఉన్నాడు.
బుధవారం సాయంత్రం జేజేపీ నాయకుడు రవీంద్ర సైనీ తన గన్‌మ్యాన్‌ను షోరూమ్ వద్ద వదిలి ఏదో పని కోసం బయటకు వెళుతుండగా, దారిలో ముగ్గురు బైక్ రైడింగ్ యువకులు మెరుపుదాడి చేసి అతనిపై కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వెంటనే రవీంద్ర నేలపై పడిపోయాడు. హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రవీంద్ర సైనీని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రస్తుతం రవీంద్ర సైనీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులు నగరం నుంచి తప్పించుకోకుండా వివిధ చోట్ల దిగ్బంధనం చేస్తున్నారు. అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసు అధికారులు కూడా అలర్ట్ అయ్యారు.