VSP: ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ముంచంగిపుట్టు మండలం జోలాపుట్ గ్రామంలో వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్ట్ ప్రతిపాదించబడిందని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ తెలిపారు. బుధవారం జోలాపుట్టులో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలో పాల్గొన్నారు. ఏరోడ్రోమ్ ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు.