హర్యానాలో ఆత్మహత్య చేసుకున్న ASI సందీప్ బంధువు ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎస్ పూరన్‌పై జరుగుతున్న దర్యాప్తు కారణంగానే సందీప్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని తెలిపారు. ‘గత 2-3 రోజులుగా ఆయన చాలా ఉద్రిక్తంగా ఉన్నారు. తన సూసైడ్ నోట్లో కొన్ని విషయాలు కూడా రాశారు’ అని ఆ బంధువు చెప్పారు. సందీప్ మృతదేహాన్ని పోలీసులకు అప్పగించడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు.