JGL: గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు చేయించుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మావతి అన్నారు. పోషణ మాస వేడుకల్లో భాగంగా రాయికల్ పట్టణంలోని గర్భిణీల ఇళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా పోషకాహారంతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో 102, 108 సేవలను వినియోగించుకోవాలని అన్నారు. అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.