ADB: బోథ్ మండలంలోని కరత్వాడ్ డ్యాం సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రమాకాంత్, అరుణ్ అనే ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పట్నపూర్ వైపు వెళ్తున్న బైక్ను బ్లేడు ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే రాజ్ గోండ్ జిల్లా అధ్యక్షుడు శంకర్ స్పందించి, క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు.