W.G: సుదీర్ఘకాలంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ ఇవాళ తణుకులో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ గౌరవ అధ్యక్షుడు బొద్దాని నాగరాజు ఆధ్వర్యం వహించారు.