ప్రకాశం: కార్తీకమాసాన్ని పురస్కరించుకుని పొదిలి డిపో నుంచి ప్రముఖ శైవ క్షేత్రాలైన అరుణాచలం, శ్రీశైలం, పంచరామాలకు భక్తుల కోరిన రోజున ప్రత్యేక ఆర్టీసి బస్సు సర్వీసులను నడపనున్నట్లు మేనేజర్ శంకర్రావు బుధవారం తెలిపారు. ప్రతి ఆదివారం మరియు సెలవు రోజుల్లో పాకల బీచ్‌కి సర్వీసులు నడపనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.