ASR: పీఎం జన్ మన్ ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ పీడీ బాబు నాయక్ లబ్దిదారులకు సూచించారు. బుధవారం ఆయన కొయ్యూరు మండలంలోని డౌనూరు పంచాయతీ బచ్చింత గ్రామంలో హౌసింగ్ ఏఈ పొత్తూరు ఉమామహేశ్వరరావుతో కలిసి పర్యటించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచించారు.