GNTR: ఎస్పీ వకుల్ జిందాల్ తెనాలిలోని పోలీస్ స్టేషన్లను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. డీఎస్పీ, సీఐలతో కేసులపై చర్చించి, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తెనాలిలో రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, అసాంఘిక చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించేది లేదని తెలిపారు. ప్రతి ఆదివారం రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు.