KDP: మైదుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో DSC ద్వారా నూతనంగా నియమితులైన తెలుగు ఉపాధ్యాయురాలు బి. స్వర్ణ లక్ష్మీ, గణిత ఉపాధ్యాయుడు ఎస్.రవీంద్ర రెడ్డిలను ఎస్టీయు జిల్లా ఆర్థిక కార్యదర్శి గోశెట్టి రామమోహన్ సర్వీస్ ఫైళ్లను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా విధులలో చేరిన ఉపాధ్యాయులు విద్యార్థులకు విశిష్టంగా సేవలందించాలని HM సూచించారు.