కోనసీమ: అమలాపురం మండలం బండారులంలో 12 నెలలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు బుధవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వైసీపీ నాయకుడు జానా గణేశ్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రామంలో చెత్త పేరుకుపోయి, ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని గణేశ్ ఆరోపించారు. వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు.