కృష్ణా: విజయవాడకు చెందిన ప్రసిద్ద చిత్రకారులు సన్నాల సత్యనారాయణ వరప్రసాద్ ఆకస్మిక మరణ వార్త తనను ఎంతో బాధించిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. వరప్రసాద్ మృతి పట్ల బుధవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. వారి ఆత్మశాంతికి ప్రార్దిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వరప్రసాద్ మృతి చిత్రకళా రంగానికి తీరని లోటు అన్నారు.