SRPT: గాంధీభవన్లో ఫ్లెక్సీలు పెట్టడం పట్ల పటేల్ రమేష్ రెడ్డి స్పందించారు. తన పేరుతో ఎవరు ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారో తనకి తెలియదన్నారు. SRPTలో దామోదర్ రెడ్డి తర్వాత రాజకీయాలు చేయాలనేది తన కోరిక అన్నారు. తానెప్పుడూ పార్టీకి విధేయుడునేనని, పార్టీకోసం కష్టపడ్డానని స్పష్టం చేశారు. జిల్లాలోనీ సీనియర్ నేతలతో విబేధాలు లేవని, జిల్లా DCC పదవి ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.