NRML: త్వరలోనే ప్రారంభం కానున్న వరి కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వారు మాట్లాడుతూ.. గతంలో కొనుగోలు కేంద్రాలలో ఏర్పడిన ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలని, వరి కొనుగోలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.