AP: RTGSపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. RTGS సేవల పట్ల ప్రజాసంతృప్త స్థాయిపై అధికారులతో చర్చించారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు కలిగిన ప్రయోజనాలు తదితర అంశాలపై వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. GST తగ్గింపుపై పెద్దఎత్తున అవగాహన కల్పించాలని అధికారులకు సీఎం సూచించారు. దీపావళి తర్వాత కూడా ప్రజల్లో పన్ను తగ్గింపుపై అవగాహన కల్పించాలన్నారు.