కేరళలో కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా(80) మృతిచెందారు. ఆయుర్వేద చికిత్స కోసం ఆరు రోజుల క్రితం ఆయన తన కుమార్తె, సన్నిహిత కుటుంబ సభ్యులతో కలిసి కేరళలోని కూతట్టుకుళం చేరుకున్నారు. ఒడింగా ఆస్పత్రిలో క్రమం తప్పకుండా వైద్యం చేయించుకుంటున్నారు. ఇవాళ ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఆయన గుండెపోటుతో మరణించారు. కెన్యా రాజకీయాల్లో ఒడింగా 2008 నుంచి 2013 వరకు ప్రధానిగా పనిచేశారు.