KNR: కరీంనగర్ రూరల్ దుబ్బపల్లిలోని ఓ ఇంట్లో 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని దుబ్బపల్లికి చెందిన కర్రె గంగారాం మధ్యవర్తుల ద్వారా రేషన్ బియ్యాన్ని సేకరించి తన ఇంటి ఆవరణలోని ఓగదిలో 300 క్వింటాళ్లు నిల్వ చేశాడు. సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్సై నరేష్ ఆఇంటిని తనిఖీ చేయగా రేషన్బయ్యం ఉన్నట్లు గుర్తించారు.