MBNR: పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లో 4వ స్నాతకోత్సవం గురువారం ఉదయం 10:00 గంటలకు ప్రారంభం కానుంది. ఈ స్నాతకోత్సవంలో మొత్తం 83 బంగారు పతకాలు ప్రదానం చేయనున్నారు. అలాగే, 12 మందికి పీహెచ్.డీ. (కెమిస్ట్రీ-5, మైక్రోబయాలజీ-5, బిజినెస్ మేనేజ్మెంట్-1, కామర్స్-1) డిగ్రీలతో పాటు, 2,809 పీజీ, 8,291 బీఈడీ, 18,666 యూజీ పట్టాలను అందజేయనున్నారు అని అదికారులు తెలిపారు.