NLG: దేవరకొండలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాసం, అన్నప్రాసన శ్రీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలునాయక్ పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయుంచారు. అనంతరం మాట్లాడుతూ.. చిన్నారులు, మహిళలు మంచి పోషకాహారం తీసుకోవాలని, ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందిస్తుందని తెలిపారు.