TG: రీజినల్ రింగ్ రోడ్డుపై రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీకి రైతులు సిద్ధమైనట్లు ప్రకటించారు. ఈనెల 20వ తేదీలోపు ప్రభుత్వం స్పందించాలని అల్టిమేటం జారీ చేశారు. లేకపోతే 21న నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు. మొత్తం 300 మంది నామినేషన్లు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.