తమిళ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా స్టూడియోకి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. చెన్నైలోని టీ నగర్లో ఉన్న ఆయన స్టూడియోలో పేలుడు పరికరాన్ని అమర్చినట్లు అందులో ఉంది. దీంతో పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు, అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అది నకిలీ బెదిరింపుగా తేల్చారు.