కెన్యా మాజీ ప్రధాని, తన ప్రియ మిత్రుడు రైలా ఒడింగా మరణం పట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఒడింగా గొప్ప రాజనీతిజ్ఞుడు, భారతదేశానికి ప్రియమైన స్నేహితుడని మోదీ కొనియాడారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి తనకు ఆయనతో అనుబంధం ఉందని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో ఒడింగా కుటుంబానికి, కెన్యా ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.