KNR: గుండెపోటు సమయంలో అవలంబించవలసిన సీపీఆర్ (కార్డియో పల్మనరీ రెసిసికేషన్) పద్ధతిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని బుధవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈనెల 13 నుంచి 17 వరకు సీపీఆర్ అవగాహన వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి సీపీఆర్‌పై శిక్షణ నిర్వహిస్తున్నారు.