STPT: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మోతె మండలం ఎంపీడీవో ఆంజనేయులు అన్నారు. ఇవాళ మామిళ్ళగూడెంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం విక్రహించి ఏ-గ్రేడ్‌కు రూ.2,389, బీ-గ్రేడ్ కు రూ.2,369 మద్దతు ధర పొందాలని సూచించారు.