KDP: రూ.5 కోట్లతో బైపాస్ రోడ్డు విస్తరణ పనులకు బుధవారం ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి భూమి పూజ చేశారు. మంగళవారం ప్రొద్దుటూరుకు వచ్చిన కలెక్టర్ శ్రీధర్ ఈ రోడ్డు పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. వెంటనే DMF నిధుల నుంచి రూ.5 కోట్లు మంజూరు చేశారు. స్థానిక రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు బైపాస్ రోడ్డు విస్తరణ చేస్తున్నట్లు తెలిపారు.