కృష్ణా: రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అవనిగడ్డ ఎస్.వీ.ఎల్ క్రాంతి డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించారు. నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ జాబ్ మేళా ప్రారంభించారు. యువత చదువు పూర్తయిన తరువాత సమయాన్ని వృధా చేయకుండా వచ్చిన ఉద్యోగంలో చేరి తమ జీవన ప్రయాణం ప్రారంభించాలన్నారు. అనంతరం మెరుగైన అవకాశాలు అందుకొని ఎదగాలని సూచించారు.