NLG: నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రవేటు కంపెనీలో ఉద్యోగాలు కల్పించుటకు జిల్లా కేంద్రంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 7893420435 ఫోన్ చేయవచ్చని సూచించారు.