ADB: భీంపూర్ మండలంలోని భగవాన్పూర్, గుబిడి గ్రామాల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్వహించిన దండారి కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి వచ్చిన ఎస్పీకి ఆదివాసి సాంస్కృతి సాంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి గుస్సడి వేషధారణ వేసుకొని నృత్యం చేస్తూ ఆడుతూ సందడి చేశారు.