పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల ఈజిప్ట్‌లో జరిగిన గాజా సమ్మిట్ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. దీంతో స్వదేశంలో షరీఫ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ట్రంప్ చేతిలో కీలుబొమ్మలా మారి, దేశాన్ని (పాకిస్థాన్‌ను) అమ్మేశారంటూ’ నెటిజన్లు తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.