E.G: రాజమండ్రిలోని 42వ వార్డులో ఉన్న ఆయేషా మసీదులో ముస్లింల సౌకర్యార్థం షెడ్డు నిర్మాణానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం శంకుస్థాపన చేశారు. ముస్లింల కోరిక మేరకు తన భవాని చారిటబుల్ ట్రస్ట్ నిధులతో ఈ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి తాము అహర్నిశలు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.