NLG: దామరచర్ల మండలం మాన్సింగ్ తండాలో అక్రమంగా రెండు వేర్వేరు కుటుంబాల వద్ద ఉన్న ఇద్దరు శిశువులను అంగన్వాడీ టీచర్ల సర్వేలో గుర్తించారు. ఈ శిశువులను కొనుగోలు చేశారా లేక దత్తత తీసుకున్నారా అనే అంశంపై సంబంధిత శాఖల అధికారులు విచారణ చేస్తున్నారు. సాగర్ మండలం ప్రాంతం నుంచి ఒక మగ శిశువును, త్రిపురారం మండలం నుంచి ఒక ఆడ శిశువును తెచ్చినట్లు ప్రాథమిక సమాచారం.