AKP: రాంబిల్లి మండలం కృష్ణంపాలెంలో రిలయన్స్ సాఫ్ట్ డ్రింక్స్, ప్యాకేజింగ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమ ఏర్పాటు కానుంది. దీనికి రూ.784 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. గ్రామంలో 30 ఎకరాల భూమిని ఎకరం రూ.40 లక్షలు చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ఈ పరిశ్రమ ద్వారా 300 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి.