ప్రకాశం: గిద్దలూరులో మద్యం తాగి ద్విచక్ర వాహనం నడిపిన ఓ వ్యక్తికి గిద్దలూరు కోర్టు గురువారం వంద రోజులు శిక్ష విధించింది. పట్టణంలో పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో మద్యం తాగి వాహనం నడుపుతున్న వ్యక్తిని గుర్తించారు. అనంతరం గిద్దలూరు కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి భరత్ చంద్ర 100 రోజులు జైలు శిక్షతో పాటు రూ. 15 వేల జరిమానా విధించారు.