NLR: కలిగిరి మండలం వెలగపాడు పంచాయతీలో జరిగిన అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ 2.0 రెండో విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని రైతులకు చెక్కులను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి రెండో విడతలో 45,275 మంది రైతులకు రూ. 30.18 కోట్లను ప్రభుత్వం జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.