కోనసీమ: అమలాపురం మండలం ఎస్. యానం బీచ్లో నిర్వహించే సంక్రాంతి బీచ్ ఫెస్టివల్ కార్యక్రమానికి సంబంధించి బుధవారం ఎస్ యానం బీచ్ ఆవరణలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, కలెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు ఈ ఉత్సవాలకు హాజరవుతారని, వీటికి తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.